ప్రకాశం: లోన్ రికవరీ ఏజెంట్స్ లోన్ తీసుకున్న వారిని వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోన్ రికవరీ ఏజెంట్స్ RBI నిబంధనల మేరకు నడుచుకోవలసి ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.