NZB: తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది.