BHNG: కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక సోమవారం సందర్భంగా నిన్న యాదగిరిగుట్టపైన గల శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ దీపారాధనలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అర్చకులు, అధికారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.