VZM: 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను వచ్చే నెల 31 లోగా క్లెయిమ్ చేసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఈ సందర్భంగా కేంద్రం రూపొందించిన మీ డబ్బు-మీ హక్కు గోడ పత్రికను ఆవిష్కరించారు. జిల్లాలో అన్ని బ్యాంకుల్లో 52.35 కోట్ల రిటైల్ డిపాజిట్లు, 7.19 కోట్ల సంస్థాగత డిపాజిట్లు, 9.99 కోట్ల ప్రభుత్వ డిపాజిట్లు ఉన్నాయన్నారు.