ప్రకాశం: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పలు సూచనలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నదీ స్థానాలు చేసేటప్పుడు, దేవాలయాల వద్ద దర్శనాల కోసం సంయమనం పాటించాలన్నారు. ముందు ఉన్న వారిని నెట్టి వేయవద్దని కోరారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే సబ్ డివిజన్లో దేవాలయ వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.