BHPL: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.