AP: గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్‌కు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చెవిరెడ్డిని విజయవాడ జైలు నుంచి ఎయిమ్స్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎయిమ్స్‌లో రెండో రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అధికారులు చెవిరెడ్డిని జైలుకు తరలించనున్నట్లు సమాచారం.