CTR: కుప్పం బైపాస్ రోడ్డులోని షాదీ మహల్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పం పూల మార్కెట్ నుంచి పూలను కర్ణాటకకు తీసుకెళ్తున్న కారు రాంగ్ రూట్లో వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బంగారునత్తానికి చెందిన యువకుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.