ADB: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. బోథ్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన పూలోజి బాబా భక్తులు నగేశ్‌ను ఆయన నివాసంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలను ఎంపీకి వివరించగా.. సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జుగాడు రావ్, విజయ్ పటేల్, గోపాల్ తదితరులున్నారు.