AP: పోలీస్ వ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. YCP హయాంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 6,100 మంది కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు గుర్తుచేశారు.