బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక హామీ ఇచ్చారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ‘మై-బహిన్ మాన్ యోజన’ కింద రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి రూ. 30,000 కానుకగా అందిస్తామన్నారు. జనవరి 14న సంక్రాంతి రోజున ఈ డబ్బును జమ చేస్తామని తెలిపారు. ఇది ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది.