BDK: భద్రాచలం పట్టణ కేంద్రంలో భద్రాద్రి బ్లడ్ సెంటర్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో చికిత్స నిమిత్తం వచ్చే ప్రజలకు రక్తం అందుబాటులో ఉండడం కోసం ఈ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, నిర్వాహకులను అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు.