ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంనకు కార్తీక పౌర్ణమి బుధవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.