ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 69.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. సింగరేణి 27.2, కామేపల్లి 17.8, పెనుబల్లి 10.2, ఏన్కూరు 6.8, రఘునాథపాలెం 3.0, కొణిజర్ల, వైరా మండలాల్లో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.