HYD: నాంపల్లి పోలీస్ స్టేషన్లో సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్ సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు శుక్రవారం అందించారు. IMEI నెంబర్ల ఆధారంగా 70 ఫోన్లను గుర్తించి యజమానులకు తిరిగి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి సెల్ ఫోన్లను ట్రేస్ చేయడం జరిగిందన్నారు.