KNR: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగిత్యాల జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.