ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఛాంపియన్గా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో పుణేరి పల్టన్ను 30-28 తేడాతో ఓడించి రెండో సారి పీకేఎల్ టైటిల్ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పుణేరి పల్టన్ కంటే దబాంగ్ 2 పాయింట్లు అధికంగా సాధించింది.