హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. నయనికతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.