PLD: కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్తో సైదావలి (50) అనే వ్యక్తి మృతి చెందడని స్థానికులు తెలిపారు. పశువులకు నీళ్లు తాపేందుకు మోటార్ వేయబోతూ.. తెగిపడిన విద్యుత్ వైరు తగలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.