NZB: విద్యుత్ ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ అన్నారు. ఎస్ఎన్ పురం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి డాబాలపై జీఐ వైర్లపై బట్టలు ఆరేయ వద్దని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్ రెడ్డి, ఉపాధ్యాయుడు శ్యామ్ ఉన్నారు.