అన్నమయ్య: మదనపల్లె జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన అండర్-14 అథ్లెటిక్స్‌లో చెంబకూరు హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి లోచన్ సాయి ప్రతిభ చూపారని జిల్లా SGF నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అతను పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం HM రమేశ్ బాబు, PD దిలీప్ కుమార్, మంజులమ్మ, విద్యార్థులు అతడిని అభినందించారు.