NLG: చింతపల్లి మండల వింజమూరు పరిధిలోని రాయినిగూడెం శివారులో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటలను ఎంఏవో శ్రావణి కుమారి మంగళవారం పరిశీలించారు. పత్తి పంటకు జరిగిన నష్టాల విషయాన్ని ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఏర్పుల నరసింహ వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు క్షేత్రస్థాయి సందర్శనకు విచ్చేశారు. రైతులు వెంకటయ్య, రామయ్య, పెద్దయ్య, లింగం, అనిల్ ఉన్నారు.