తిరుపతి తుడా కార్యాలయంలో ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఆర్ఎస్, బీపీఎస్, పట్టణ ప్రణాళిక, మౌలిక వసతులు, ఆదాయ వనరులుపై చర్చించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, పరిసర పట్టణాల్లో అభివృద్ధి వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గరుడా వారధిపై ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.