KDP: అక్టోబర్ 11న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మైదుకూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐసిడిఎస్ సీడీపీవో శ్రీదేవి మంగళవారం బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు చదువులో మాత్రమే కాక, సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.