JGL: మెట్పల్లి పెద్ద చెరువు వద్ద గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగామాత దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. హోమం, యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కళ్యాణం, మంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు వేదమంత్రాలతో జరిపించారు. అనంతరం తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు.