ADB: నేడు గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.