HYD: సైబరాబాద్ పోలీస్లు మాదక ద్రవ్యాల ముఠాపై గట్టిగా దెబ్బకొట్టారు. గచ్చిబౌలి, ఎస్ఓటీ మాధాపూర్ టీమ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, విక్రయంలో నిమగ్నమైన 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళ్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని సోలీసులు హెచ్చరించారు.