NZB: జిల్లా ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు భీమగల్ ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు వాహనాలను వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావు మంగళవారం తెలిపారు. భీమగల్ ఎక్సైజ్ పరిధిలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వివిధ కేసుల్లో పట్టబడిన ద్విచక్ర వాహనాలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు.