PPM: పర్యావరణ పరిరక్షణకు యువత ముందడుగు వేసింది. భామిని మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన నల్లరాయిగూడ జలపాతం వద్ద మంగళవారం యువత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి, నల్లరాయిగూడ యూత్ సభ్యులు పాల్గొన్నారు.