MDK: పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు స్పెషల్ లోక్ అదాలత్ దృష్ట్యా మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థతో సమన్వయం పాటిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కృషి చేయాలన్నారు.