ELR: రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఇవాళ సాయంత్రం సినీ తరహాలో వరుస రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువుల దాణా లారీ నుంచి రోడ్డుపై ఒలికిపోవడంతో దారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం స్కిడ్ కావడంతో దాని వెనుక వచ్చిన కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో ద్విచక్ర వాహనం, లారీ కూడా కారును ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో ఐదుగురు గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు.