అనంతపురంలోని కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీ నిధులతో రూ. 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. దీని ద్వారా 1800 మంది విద్యార్థినులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చినట్లు ఎంపీ పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, భవిష్యత్తను సుస్థిరం చేసుకోవాలని ఆయన సూచించారు.