BHNG: బీబీనగర్ పెద్ద చెరువులో మృతదేహం లభ్యంమైంది. బీబీనగర్ పెద్ద చెరువు నీటిపై మృతదేహం తేలి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదారాబాద్ సనత్‌నగర్‌కు చెందిన బైరి జగన్(38)గా పోలీసులు గుర్తించారు.