VZM: విజయనగరం ఎల్బిజి నగర్, రామకృష్ణ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ కాలనీల్లో మంచినీరు, కాలువలు, రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈమేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని నాయకులు కోరారు.