VZM: జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.