KDP: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 సందర్భంగా, మంగళవారం కమలాపురం మండల రిసోర్స్ సెంటర్లో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షను ఎంఈవో సుభాషిణి ప్రారంభించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులలో సైన్స్ అవగాహన పెంపొందించడం, వారి శాస్త్రీయ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.