MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆపార్ ఐడీ జనరేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్స్‌ను సందర్శించారు. పాఠశాలలో ఆపార్ ఐడీ జనరేషన్‌ను కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉన్నారు.