HYD: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో బోరబండకు చెందిన అత్త కోడళ్లు గున్నమ్మ, కల్పన మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.