ELR: కొయ్యలగూడెంలో ఓ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ నేత్ర వైద్య నిపుణులు చక్రవర్తి పర్యవేక్షణలో విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, 11 మంది విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేసినట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. మేము ఏప్పుడు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.