ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్‌పుర్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.