GNTR: గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం నగరంలోని రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పూడిక తీసిన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, దీనిని కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.