VZM: గరివిడి మండలం వెదురువలస గ్రామంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటూ సంతకాల సేకరణ చేపట్టారు.