NZB: దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఇందల్వాయి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఇందల్వాయి తండా గ్రామంలో ఇంటింటికి తిరిగి జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం మురికి కాలువల్లో దోమలు వ్యాప్తి చెందకుండా మందులు చల్లించారు.