SRPT: చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామ కార్యదర్శికి విన్నపించారు. బడ్జెట్ లేదు అని చెప్పుకుంటూ రావడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాలు లేక రాత్రి వేళల్లో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో గ్రామంలోని పెద్దలు, యువకులు కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.