KNR: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుంచి చేపట్టిన ఐక్యత మార్చ్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు కొనియాడారు.