ATP: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు రోజున జిల్లా పోలీసు యంత్రాంగం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించింది. క్లాక్ టవర్ నుంచి జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది. AR అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా మాట్లాడుతూ.. అక్టోబర్ 21 నుంచి ఓపెన్ హౌస్, రక్తదానం, వ్యాసరచన వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.