PDPL: మంథని మండల పరిధిలో అకాల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని మంథని మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని మండలంలోని ఉప్పట్ల, చిల్లపల్లి, గుంజపడుగు గ్రామాలలో తుపాన్‌తో నేలకు ఒరిగిన పంట పొలాలను పరిశీలించారు.