ఏక్తాదివస్ను పురస్కరించుకుని కేంద్రియ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మొత్తం 1466 మంది పోలీసులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో జమ్మూకశ్మీర్ నుంచి 40 మంది పోలీసులకు అవార్డులు అందించింది. ఈ 40 మందిలో పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు హోంశాఖ చోటు కల్పించింది.