ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పెద్ద చెరువును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పెద్ద చెరువు తూములకు లీకేజీలు ఏర్పడడంతో, ఎమ్మెల్యే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపడుతున్న మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.