SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు శుక్రవారం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.